Share News

కోళ్ల ఇంటి వద్ద కార్యకర్తల సందడి

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:59 PM

శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి పేరు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేటాయించడంతో ఎల్‌.కోటలో సంబరాలు మిన్నంటాయి. ఐదు మండలాల కార్యకర్తలతో లలితకుమారి ఇంటి ప్రాంగణం జనసం ద్రంగా మారింది. మందుగుండు, డిజేల శబ్దాలతో కార్యకర్తలు సందడిచేశారు. లలితకుమారికి జనసేన సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ కార్యకర్తలతో కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు టిక్కెట్టు కేటాయించినందుకు అఽధినేత చంద్రబాబుకు, మా కుటుంబంఫై నమ్మకం ఉంచినందుకు పార్టీ పెద్దలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థి భరత్‌తోపాటు ఎస్‌.కోట నియోజకవర్గ సీటును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని చెప్పారు. సోదరుడు గొంప కృష్ణతో కలిసి గ్రామగ్రామానికి వెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, కరెడ్ల ఈశ్వరరావు, మల్లునాయుడు, రమణమూర్తి, బంగారు రమేష్‌, కల్లద్దాల శ్రీను పాల్గొన్నారు.

కోళ్ల ఇంటి వద్ద కార్యకర్తల సందడి
లలితకుమారి ఇంటి ముందు సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

లక్కవరపుకోట: శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి పేరు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేటాయించడంతో ఎల్‌.కోటలో సంబరాలు మిన్నంటాయి. ఐదు మండలాల కార్యకర్తలతో లలితకుమారి ఇంటి ప్రాంగణం జనసం ద్రంగా మారింది. మందుగుండు, డిజేల శబ్దాలతో కార్యకర్తలు సందడిచేశారు. లలితకుమారికి జనసేన సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ కార్యకర్తలతో కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు టిక్కెట్టు కేటాయించినందుకు అఽధినేత చంద్రబాబుకు, మా కుటుంబంఫై నమ్మకం ఉంచినందుకు పార్టీ పెద్దలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థి భరత్‌తోపాటు ఎస్‌.కోట నియోజకవర్గ సీటును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని చెప్పారు. సోదరుడు గొంప కృష్ణతో కలిసి గ్రామగ్రామానికి వెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, కరెడ్ల ఈశ్వరరావు, మల్లునాయుడు, రమణమూర్తి, బంగారు రమేష్‌, కల్లద్దాల శ్రీను పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి

రామభద్రపురం: రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని బొబ్బిలి రూరల్‌ సీఐ ఎస్‌.తిరుమలరావు కోరారు.మండలంలోని రొంపల్లి, ఎస్‌.సీతారాంపురం, కొట్టక్కిల్లో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:59 PM