Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 26 , 2024 | 12:21 AM

కౌంటింగ్‌ పూర్తయ్యే వరకూ ప్రతిఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎల్విన్‌పేట సీఐ సత్యనారాయణ హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

కురుపాం: కౌంటింగ్‌ పూర్తయ్యే వరకూ ప్రతిఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎల్విన్‌పేట సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం సాయంత్రం స్థానిక శివ్వన్నపేటలో ఎన్నికల కౌంటింగ్‌ దృశ్య గ్రామపెద్దలకు, యువకులకు ఎస్‌ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ నేపథ్యంలో ఆ రోజు అందరూ సహకరించాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. అనంతరం గ్రామంలోని యువకులకు వాలీబాల్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:21 AM