Share News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 20 , 2024 | 11:41 PM

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ ఏఎస్‌ చక్రవర్తి హెచ్చరించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

చీపురుపల్లి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ ఏఎస్‌ చక్రవర్తి హెచ్చరించారు. చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌ లో ఆయన సోమవారం జి.ములగాం గ్రామస్థులు, పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి తగాదాల కారణంగా గ్రామంలో ఉన్న సుహృద్భావ వాతావరణానికి విఘాతం కలుగుతుంద న్నారు. నాయకులు, ప్రజలు సంయమనంతో మెలగాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ తమ వంతు సహకారం అందించాలని డీఎస్పీ కోరారు. అనంతరం, ఇటీవల ఘర్షణకు బాధ్యులైన వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఈ సమావేశంలో సీఐ సీహెచ్‌.శ్యామలరావు, ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు, ఇరువర్గాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:41 PM