Share News

పార్వతీపురం రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:29 AM

అమృత్‌భారత్‌లో పార్వతీపురం(బెలగాం) రైల్వేస్టేషన్‌ ఎంపికైందని వాల్తేర్‌ డీఆర్‌ఎం సౌరవ్‌ కుమార్‌ తెలిపారు.

 పార్వతీపురం రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న డీఆర్‌ఎం సౌరవ్‌ కుమార్‌

బెలగాం, ఫిబ్రవరి 25 : అమృత్‌భారత్‌లో పార్వతీపురం(బెలగాం) రైల్వేస్టేషన్‌ ఎంపికైందని వాల్తేర్‌ డీఆర్‌ఎం సౌరవ్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన పార్వతీపురం రైల్వేస్టేషన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్‌ అభివృద్ధికి రూ.14.76 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల పనులకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో 550 రైల్వే స్టేషన్లు అమృత్‌ భారత్‌ ఎంపికయ్యాయని, వాటిలో పార్వతీపురం స్టేషన్‌ ఉందని అన్నారు. అత్యాధునిక హంగులతో పార్వతీపురం రైల్వే స్టేషన్‌ను మోడ్రన్‌గా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 12:29 AM