Share News

108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:04 AM

108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఎస్టీసెల్‌ జనరల్‌ సెక్రటరీ పాలవలస గౌరు కోరారు.

 108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

బాడంగి: 108 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఎస్టీసెల్‌ జనరల్‌ సెక్రటరీ పాలవలస గౌరు కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎరుకులపాకలు గ్రామానికి చెందిన రొంగళి దీపిక కడుపునొప్పి తాళలేక బాడంగి పీహెచ్‌సీలో చేరారని, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అంబులెన్స్‌తో విజ యనగరం రిఫర్‌చేశారని చెప్పారు. ఆమెను విజయనగరం తరలించే సమయంలో ఎరుకులపాకలు వద్ద 108 అంబులెన్స్‌ ఆగిందని, దీపిక తల్లిదండ్రులతోపాటు పేషెం ట్‌కు సహాయంనిమిత్తం మరో ఆమె కూడా అంబులెన్స్‌లో కూర్చొందని తెలిపారు. అంబులెన్స్‌ సిబ్బంది ఆమెను దిగిపోవాలని కోరారని, ముందుకు వెళ్లకుండా రోడ్డు పక్కనే నిలిపివేసి అక్కడ ఉన్న వారితో వాగ్వాదానికి దిగారని చెప్పారు. వీరిపై అధి కారులు కలిసి చర్య తీసుకొని విధుల నుంచి తప్పించాలని కోరారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా పీహెచ్‌సీ ఎదుట పేషెంట్‌ బంధువులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 12:04 AM