Share News

పోరాటాలతోనే హక్కుల సాధన

ABN , Publish Date - May 30 , 2024 | 11:55 PM

పోరాటాలతోనే కార్మికుల హక్కులను సాధించుకోగలమని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి.కాంతారావు అన్నారు.

పోరాటాలతోనే హక్కుల సాధన

గజపతినగరం: పోరాటాలతోనే కార్మికుల హక్కులను సాధించుకోగలమని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి.కాంతారావు అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఎస్‌బీఐ వద్ద ఆ సంఘం పతాకా న్ని ఆవిష్కరించారు. సంఘ నాయకుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

దత్తిరా జేరు: సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కోమటిపల్లి ఆటో జంక్షన్‌ వద్ద సీఐటీయూ అనుబంధ ఆటో యూనియన్‌ కార్యదర్శి బి.అప్పలనాయుడు ఆ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సంఘ నాయకులు పి.రాము, వై.ఈశ్వరరావు, టి.హరీష్‌, బాలు, ఈశ్వరరావు, భాషా, నాగరాజు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: నెల్లిమర్లలో గురువారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) నాయకుడు బాబూరావు ఆ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌ ( బొబ్బిలి ): కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ పోరాటాలు చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు శంకరరావు అన్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం బొబ్బిలిలో అరుణపతాకాన్ని గౌరి, శంకరరావు ఎగురవేశారు. కార్యక్రమంలో వాసు, వెంకటిఇ, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:55 PM