ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:23 AM
ట్రాక్టర్ బోల్తాపడడంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. లక్కవరపుకోట మండలం నిడిగట్టు గ్రామానికి చెందిన సారికి వెంకటేష్(23) ట్రాక్టర్ కూలీగా పనిచేస్తున్నాడు.

కొత్తవలస: ట్రాక్టర్ బోల్తాపడడంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. లక్కవరపుకోట మండలం నిడిగట్టు గ్రామానికి చెందిన సారికి వెంకటేష్(23) ట్రాక్టర్ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మండలంలోని చినరావుపల్లి నుంచి లక్కవరపుకోట మండలం నిడిగట్టుకు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి బోల్తాపడింది. ఈ ఘటనలో తొట్టెలో కూర్చుని ఉన్న వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న సతీష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు ట్రాక్టర్ యజమాని అయిన ఎల్‌కోట ఎంపీపీ శ్రీనివాసరావు అంగీక రించారు. మృతి చెందిన యువకుని బంధువు సారికి శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ సతీష్‌పై ఎస్‌ఐ దేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం తరలించారు.