కారు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:08 AM
కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మం డలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తవలస, జూలై 4: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మం డలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి గ్రామానికి చెందిన కొత్తలి సూర్యనారాయణ(25) బుధవారం రాత్రి కొత్తవలస వసంత్ విహార్ సమీపంలో రోడ్డు దాటుతుండగా శృంగవరపుకోట నుంచి విశాఖపట్టణం వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్ర మాదంలో సూర్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని వ్యక్తిని చికిత్స నిమిత్తం విశాఖపట్టణం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు సీఐ తెలిపారు. మృతుడి సోదరి రొంగలి దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి గురువారం శవపంచనామా నిర్వహించి పోస్టు మార్టంకు తరలించినట్టు తెలిపారు.