క్షయ రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:23 PM
వచ్చే ఏడాది నాటికి క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్షయవ్యాధి నివారణ జాయింట్ డైరక్టర్ టి.రమేష్ తెలిపారు.

- బీసీజీ టీకాలను శతశాతం పూర్తి చేయాలి
- రాష్ట్ర క్షయవ్యాధి నివారణ జాయింట్ డైరక్టర్
కొత్తవలస/లక్కవరపుకోట, జూన్ 7: వచ్చే ఏడాది నాటికి క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్షయవ్యాధి నివారణ జాయింట్ డైరక్టర్ టి.రమేష్ తెలిపారు. శుక్రవారం కొత్తవలస, ఎల్.కోట పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధి నివారణకు సంబంధించి వయోజనులకు వేసే బీసీజీ టీకాలను శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంతవరకు ఎన్ని టీకాలు వేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకాలను వేయించుకునేందుకు వయోజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. బీసీజీ టీకా వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు రావన్నారు. గ్రామాల్లోని విద్యావంతులు, గ్రామ పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందన్నారు. టీకాలు వేసే సమయంలో దీర్ఘకాలిక వ్యాఽధులు ఉన్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్.కోట మండలంలో 28 మంది క్షయవ్యాధిగ్రస్థులు ఉన్నారని వైద్యాధికారి అనిల్‌కు మార్ తెలిపారు. ఇప్పటివరకు 1,459 మంది వయోజనులకు టీకాలు వేసినట్లు చెప్పారు. 2025 నాటికి రాష్ట్రాన్ని క్షయ రహితంగా మార్చాలని జాయింట్ డైరక్టర్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఏటీవో కె.రాణి, కొత్తవలస పీహెచ్‌సీ వైద్యాధికారులు సీతల్ వర్మ, సీతామాలక్ష్మి, సిబ్బంది కృప, రమణమ్మ, శ్రీనివాస్, సూరిదేముడు, జేవీ ప్రసాదరావు తదుతరులు పాల్గొన్నారు.