ఆలోచింపజేసిన ఓపెన్ హౌస్
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:55 PM
పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులను ఆలోచింపజేసింది. విధుల్లో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, యంత్రాలు, డ్రోన్స్, డాగ్ స్వ్కాడ్, బాంబ్ డిటెక్షన్, ట్రాఫిక్ పోలీసులు వినియోగించే బ్రీత్ ఎనలేజర్స్, దిశా యాప్ తదితర వాటి గురించి ప్రతి ఒక్కరూ అడిగి తెలుసుకున్నారు.

ఆలోచింపజేసిన ఓపెన్ హౌస్
విజయనగరం క్రైం, అక్టోబరు 25( ఆంరఽధజ్యోతి): పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులను ఆలోచింపజేసింది. విధుల్లో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, యంత్రాలు, డ్రోన్స్, డాగ్ స్వ్కాడ్, బాంబ్ డిటెక్షన్, ట్రాఫిక్ పోలీసులు వినియోగించే బ్రీత్ ఎనలేజర్స్, దిశా యాప్ తదితర వాటి గురించి ప్రతి ఒక్కరూ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ విధుల గురించి పుస్తకాల్లో చదువుకోవడమే ఇప్పటివరకు తెలిసిన ఆ విద్యార్థులు స్వయంగా ఆయా యంత్రాలను చూసి తీక్షణగా పరిశీలించడం మంచి అనుభవంగా భావించారు. కార్యక్రమం ఉద్దేశించి ఎస్పీ వకుల్‌జిందాల్ మాట్లాడుతూ పోలీస్ విధుల గురించి బాలలకు వివరంగా చెప్పామన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, డీఎస్పీలు శ్రీనివాసరావు, యూనివర్స్, ఎస్‌బీ సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, నర్సింహామూర్తి, శ్రీనివాస్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.