Share News

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:02 AM

ప్రజల్లో శాస్ర్తీయ దృక్పథాన్ని కల్పించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకొండలో జనవిజ్ఞానవేదిక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి గౌరునాయుడు అధ్యక్షతన శాస్ర్తీయదృక్పధకాంపైన్‌లో భాగంగా రాష్ట్రస్థాయి సైన్స్‌కళాజాతా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పారినా యుడు సైన్స్‌కళాజాతా ద్వారా జేవీవీ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడాన్ని అభినందించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు బీవీరమణ శాస్ర్తీయ దృక్పధాన్ని పెంచేం దుకు జేవీవీ కృషిని కొనియాడారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సార్తి మహేశ్వరరావు మాట్లాడుతూ మూఢ నమమకాలను సమాజం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. తొలుతప్రదర్శించిన సైన్స్‌ నృత్య రూపకాలు, సైన్స్‌ నాటికలు,సైన్స్‌ గీతాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు బీఎం గౌరీశ్వరరావు, నాయకులు రామారావు, చిన్నారావు, ఫకీరు స్వామి, పుష్పనాధం, రామకృష్ణ, రాజకుమారి పాల్గొన్నారు.

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించాలి

పాలకొండ: ప్రజల్లో శాస్ర్తీయ దృక్పథాన్ని కల్పించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకొండలో జనవిజ్ఞానవేదిక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి గౌరునాయుడు అధ్యక్షతన శాస్ర్తీయదృక్పధకాంపైన్‌లో భాగంగా రాష్ట్రస్థాయి సైన్స్‌కళాజాతా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పారినా యుడు సైన్స్‌కళాజాతా ద్వారా జేవీవీ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడాన్ని అభినందించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు బీవీరమణ శాస్ర్తీయ దృక్పధాన్ని పెంచేం దుకు జేవీవీ కృషిని కొనియాడారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సార్తి మహేశ్వరరావు మాట్లాడుతూ మూఢ నమమకాలను సమాజం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. తొలుతప్రదర్శించిన సైన్స్‌ నృత్య రూపకాలు, సైన్స్‌ నాటికలు,సైన్స్‌ గీతాలాపనలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు బీఎం గౌరీశ్వరరావు, నాయకులు రామారావు, చిన్నారావు, ఫకీరు స్వామి, పుష్పనాధం, రామకృష్ణ, రాజకుమారి పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:02 AM