Share News

ప్రమాదాల రహదారి

ABN , Publish Date - May 30 , 2024 | 11:17 PM

పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాద భరితంగా తయారైంది. మండలంలోని ఉల్లిభద్ర ప్రధాన మార్గం నుంచి అధ్వానంగా ఉంది. గోతులు, గతుకులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ప్రమాదాల రహదారి
చిలకాం సమీపంలో రోడ్డుకు ఒకవైపు గుంతలు

పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాద భరితంగా తయారైంది. మండలంలోని ఉల్లిభద్ర ప్రధాన మార్గం నుంచి అధ్వానంగా ఉంది. గోతులు, గతుకులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మించిన రహదారికి ప్యాచ్‌ వర్క్‌ చేసిన కొద్ది నెలలకే.. మళ్లీ గుంతలు పడ్డాయి. రాత్రి సమయాల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. సంతోషపురం మార్గంలో రహదారి ఒకవైపు ఎత్తుగా, మరోవైపు లోతుగా ఉండటంతో బెంబేలెత్తి పోతున్నారు. ప్రధానంగా పాలకొండ రహదారి అధ్వానంగా ఉండటంతో పమాదాలు జరుగుతున్నాయి. చిలకాం మలుపులో రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. అలాగే ఆటోలు బోల్తా పడిన ఘటనలు కూడా ఉన్నాయి. సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లగా నిధుల కొరతతో మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. రహదారుల మరమ్మతులకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు చేశామని, మంజూరు కాగానే పనులు చేపడతామని అన్నారు.

- గరుగుబిల్లి

Updated Date - May 30 , 2024 | 11:17 PM