హౌస్ హోల్డ్ సర్వే పూర్తిచేయాలి
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:04 AM
హౌస్ హోల్డ్ సర్వేను సర్వే వేగవంతంగా పూర్తిచేయా లని ఎంపీడీవో వి.శ్రీని వాసరావు ఆదేశించారు.
రాజాం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):హౌస్ హోల్డ్ సర్వేను సర్వే వేగవంతంగా పూర్తిచేయా లని ఎంపీడీవో వి.శ్రీని వాసరావు ఆదేశించారు. మంగళవారం మండలం లోని ఒమ్మి గ్రామంలో మినీ గోకులం పనులను పరిశీలించారు. అనం తరం ఒమ్మి, ఎంజేవలస, బీఎన్‌వలస, గారాజు చీపురుపల్లి గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రతి రోజు గ్రామంలో సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని కోరారు.