Share News

రోడ్డు ప్రమాదంలో హెల్త్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:12 AM

మండలంలో చీపురు వలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువునాయు డుపేట పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రొంప ల్లి ఆదినారాయణ (41) మృతి చెందినట్టు సాలూరు రూరల్‌ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో హెల్త్‌ ఉద్యోగి మృతి

సాలూరు రూరల్‌, జూన్‌ 16: మండలంలో చీపురు వలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువునాయు డుపేట పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రొంప ల్లి ఆదినారాయణ (41) మృతి చెందినట్టు సాలూరు రూరల్‌ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు. సాలూరు మండలం అన్నం రాజువలస పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన రొంపల్లి ఆదినారాయణ తాడికొండ పీహెచ్‌సీలో హెల్త్‌ అసి స్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన పాచిపెంట మండ లం గురువునాయుడుపేట పీహెచ్‌సీకి డెప్యూటేషన్‌పై వచ్చా రు. ఆయన శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చీపురువలస వద్ద లారీ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు తొలుత మామిడిపల్లి పీహెచ్‌సీకి, తదుపరి సాలూరు ఏరియా ఆసు పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు. మృతునికి భార్య, పాప, బాబు ఉన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:12 AM