Share News

ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:00 AM

ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్‌ చేశారు.

 ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్‌ చేశారు. కురుపాం మండలంలోని ఏజెన్సీలోని మొండెంఖల్‌ చుట్టూ ఉన్న గ్రామాల్లో సీపీఐ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మంచంపై ఇద్దరు లేదా ముగ్గురు వైద్యం కోసం వచ్చారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుగుబిల్లి సూరయ్య, గిరిజన సమాఖ్య సీనియర్‌ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుండంగి లింగరాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మండంగి సింగన్న తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:00 AM