Share News

నామినేషన్ల కోలాహలం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:54 AM

జిల్లాలో బుధవారం అరకు పార్లమెంట్‌ స్థానానికి పది, శాసన సభకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

 నామినేషన్ల కోలాహలం
జనసేన పార్టీ అభ్యర్థిగా సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న జయకృష్ణ

పార్వతీపురం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి)/సాలూరు/కురుపాం: జిల్లాలో బుధవారం అరకు పార్లమెంట్‌ స్థానానికి పది, శాసన సభకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు ఎంపీ స్థానానికి గాను వైసీపీ అభ్యర్థులుగా గుమ్మ తనూజారాణి, చెట్టి వినయ్‌, సీపీఐ, సీపీఎంల నుంచి సురేంద్ర కిల్లో, అప్పలనరసయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా వెంకటరావు, నిమ్మక జయరాజు, అశోక్‌కుమార్‌ , బాలకృష్ణ, ఇండియన్‌ ప్రజా బందు పార్టీ అభ్యర్థిగా ఊయక చెంచు కలెక్టరేట్‌లో నామినేషన్ల పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తరపున ఆ పార్టీ ప్రతినిధులు రెండు సెట్ల నామినేషన్లు అందించారు.

సాలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థులుగా పీడిక రాజన్నదొర, సుదర్శనరావు, టీడీపీ అభ్యర్థిగా గుమ్మిడి సంధ్యారాణి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మువ్వల అప్పారావు నామినేషన్లు వేశారు. కురుపాంలో సీపీఐ అభ్యర్థులుగా బిడ్డిక శంకరరావు, మండంగి రమణ , వైసీపీ అభ్యర్థిగా అడ్డాకుల నరేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి తరపున ఆమె ప్రతినిధులు ఆర్వోకు నామినేషన్లు అందించారు. పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సవర చంటిబాబు, స్వతంత్ర అభ్యర్థిగా నిమ్మక పాండురంగ నామినేషన్‌ పత్రాలు అందించారు. పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థిగా బోనెల విజయచంద్ర, వైసీపీ అభ్యర్థులుగా అలజంగి జోగారావు , రవికుమార్‌ , జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పొటూరు కిరణ్‌, స్వతంత్ర అభ్యర్థిగా మోహన్‌రావు నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:54 AM