Share News

గంజాయి విక్రయాల్లో మహిళా వలంటీర్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:13 AM

గంజాయి విక్రయాల్లో పార్వతీపురానికి చెందిన ఓ మహిళా వలంటీర్‌ కీలకపాత్ర పోషించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె పోలీసులకు పట్టుబడడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

గంజాయి విక్రయాల్లో  మహిళా వలంటీర్‌

జిల్లాకేంద్రంలో కలకలం

పార్వతీపురం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయాల్లో పార్వతీపురానికి చెందిన ఓ మహిళా వలంటీర్‌ కీలకపాత్ర పోషించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె పోలీసులకు పట్టుబడడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం పట్టణ పోలీసులు ఈనెల 16న జిల్లాకేంద్రంలోని ఓ వీధిలోని మహిళ ఇంట్లో ఎనిమిది కిలోల గంజాయి బస్తాను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టగా.. సదరు మహిళ వలంటీర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఒడిశా రాష్ట్రంలోని సుంకి, సునాబేడా, కోరాపుట్‌ల నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా చిన్నపొట్లాల రూపంలో రూ.100కు వాటిని ఆమె విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు ఎలా జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహిళా వలంటీర్‌ ఆధ్వర్యంలో ఈ వ్యాపారం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్ర వాసులు కోరుతున్నారు. గంజాయి నిల్వలతో పోలీసులకు పట్టుబడిన మహిళ వార్డు వలంటీరుగా పనిచేస్తున్నారని సచివాలయ అఽధికారి అనంత్‌ బుధవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:13 AM