Share News

మరణంలోనూ వీడని బంధం

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:16 AM

: వాళ్లిద్దరూ స్నేహితులు. కష్టమొచ్చినా.. ఆనందం కలిగి నా ఒకరికొకరు చెప్పుకునేవారు. నిత్యం కలిసే ఉండేవారు. ఇద్దరికీ తండ్రులు లేకపోవడంతో ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. వారి అన్యోన్యం చూసి న విధికే కన్ను కుట్టిందేమో రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ ఒకేసారి పొట్టన పెట్టుకుంది. డెంకాడ మండలం చింతలవలస గ్రామానికి చెందిన దేబా ర్కి శరత్‌కుమార్‌(26), కర్త శివ ప్రసాద్‌(25) విషాదాంతమిది

మరణంలోనూ వీడని బంధం

డెంకాడ, జూన్‌ 2: వాళ్లిద్దరూ స్నేహితులు. కష్టమొచ్చినా.. ఆనందం కలిగి నా ఒకరికొకరు చెప్పుకునేవారు. నిత్యం కలిసే ఉండేవారు. ఇద్దరికీ తండ్రులు లేకపోవడంతో ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. వారి అన్యోన్యం చూసి న విధికే కన్ను కుట్టిందేమో రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ ఒకేసారి పొట్టన పెట్టుకుంది. డెంకాడ మండలం చింతలవలస గ్రామానికి చెందిన దేబా ర్కి శరత్‌కుమార్‌(26), కర్త శివ ప్రసాద్‌(25) విషాదాంతమిది. ఇదే మండలం బొడ్డవలస వద్ద శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొని వెళ్లిపోయింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలవలస గ్రామానికి చెందిన దేబార్కి శరత్‌కుమార్‌, కర్త శివ ప్రసాద్‌లు ఇళ్లలో టైల్స్‌ (పలకలు) ఫిట్‌ చేసే పని చేస్తుంటారు. ఇద్దరికీ తండ్రు లు లేరు. కుటుంబాలను వీరే పోషిస్తున్నారు. దూర ప్రాంతాల్లో సైతం టైల్స్‌ పని ఒప్పుకుని ఇద్దరూ వెళ్లి పూర్తి చే స్తుంటారు. శనివారం ఉదయం విశాఖ పట్నం జిల్లా భీమిలి వెళ్లి పని పూర్తిచే సుకుని తిరిగి అర్ధరాత్రి ఒంటిగంట స మయంలో స్వగ్రామం చింతలవలసకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బొడ్డవలస గ్రామం వద్దకు వచే ్చసరికి గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొ ట్టింది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు రోడ్డున పడినట్లు అయింది. చింతలవలస గ్రామం శోకసంద్ర మైంది. ఇద్దరి స్నేహాన్ని స్థానికులు గుర్తు చేసుకుంటూ కన్నీరుపెటా ్టరు. డెంకా డ ఎస్‌ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:16 AM