Share News

డోలీలో 5 కిలోమీటర్లు

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:58 PM

ఆ గిరిజన మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఇక భరించలేక కుటుంబ సభ్యులకు విన్నవించింది. వారు హుటాహుటిన స్థానికులను పిలిచి అందరూ కలిసి డోలీ కట్టి ఆస్పత్రికి పయనమయ్యారు. రాళ్లు... రప్పలు.. పొదల మధ్య నుంచి ఐదు కిలోమీటర్లు నడిచారు.

డోలీలో 5 కిలోమీటర్లు
డోలీకట్టి చిలకమ్మను తీసుకోస్తున్న దృశ్యం

డోలీలో 5 కిలోమీటర్లు

కడుపునొప్పి బాధితురాలి తరలింపు

ఆ గిరిజన మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఇక భరించలేక కుటుంబ సభ్యులకు విన్నవించింది. వారు హుటాహుటిన స్థానికులను పిలిచి అందరూ కలిసి డోలీ కట్టి ఆస్పత్రికి పయనమయ్యారు. రాళ్లు... రప్పలు.. పొదల మధ్య నుంచి ఐదు కిలోమీటర్లు నడిచారు. వెళ్తున్న క్రమంలో ఆమె కేకలను విని తల్లడిల్లిపోయారు. మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన వివాహిత సోముల చిలకమ్మకు మంగళవారం ఎదురైన పరిస్థితి ఇది. భర్త ఎర్రయ్య కుటుంబసభ్యులు, గ్రామ యువత సహాయంతో ఆమెను మైదాన ప్రాంతమైన బొడ్డవరకు చేర్చారు. అక్కడి నుంచి 108లో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.

- శృంగవరపుకోట రూరల్‌

Updated Date - Jan 09 , 2024 | 11:58 PM