Share News

2న పీఎం జుగా

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:05 PM

ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్‌ (పీఎం జుగా) కార్యక్రమాన్ని అక్టోబరు 2న నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌ రాష్ట్రం హజారీబాగ్‌లో వచ్చేనెల 2న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

 2న పీఎం జుగా
పార్వతీపురం ఐటీడీఏలో వేదికను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్‌ (పీఎం జుగా) కార్యక్రమాన్ని అక్టోబరు 2న నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌ రాష్ట్రం హజారీబాగ్‌లో వచ్చేనెల 2న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ రోజు పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో పీఎం జుగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్‌ యోజన, ఉజ్వల్‌ ఉచిత గ్యాస్‌, ఆయుష్మాన్‌భారత్‌, ఆధార్‌కార్డుల నమోదు, జలజీవన్‌మిషన్‌ , పీవీటీజీ గ్రామాల్లో మౌలిక వసతులు, ఇతర కేంద్ర పథకాల పురోగతిని తెలిపే స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, నోడల్‌ అధికారి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం ఆయన పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. పీఎం జుగా రాష్ట్రస్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు సహాయ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎ.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:05 PM