Share News

నోటాకు 18,229 ఓట్లు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:30 PM

ఈ ఎన్నికల్లో జిల్లాలో నోటాకు 18,229 ఓట్లు పడ్డాయి.

నోటాకు 18,229 ఓట్లు

సాలూరు రూరల్‌, జూన్‌ 6: ఈ ఎన్నికల్లో జిల్లాలో నోటాకు 18,229 ఓట్లు పడ్డాయి. సాలూరు నియోజక వర్గంలో 5,743, పార్వతీపురంలో 3,465, కురుపాంలో 4,761, పాలకొండ నియోజకవర్గంలో 4,260 ఓట్లు నోటాకు పడ్డాయి. గిరిశిఖర గ్రామాల్లో ఉన్న పోలింగ్‌స్టేషన్లలో సైతం నోటాకు ఓట్లు పడడం విశేషం. పోస్టల్‌ బ్యాలెట్లలో కూడా నోటాకు ఓటు వేశారు. నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 16,478 ఓట్లు నోటాకు లభించగా ఈ ఎన్నికల్లో 18,229 ఓట్లు లభించాయి. గతం కంటే 1,751 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సాలూరులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీఎస్పీల అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు రావడం విశేషం.

Updated Date - Jun 06 , 2024 | 11:30 PM