Share News

16 మంది జూదరుల అరెస్టు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:23 AM

పట్టణ పరిధిలోని కంచరవీధి శివాలయంలో బుధ వారం రాత్రి పేకాట ఆడుతుండగా 16 మంది పట్టుబడినట్లు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు.

16 మంది జూదరుల అరెస్టు

బొబ్బిలి, జనవరి 17: పట్టణ పరిధిలోని కంచరవీధి శివాలయంలో బుధ వారం రాత్రి పేకాట ఆడుతుండగా 16 మంది పట్టుబడినట్లు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. తమకు అందిన సమాచారంతో ఎస్‌ఐ జి.లోవరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పేకాట శిబిరంపై దాడులు చేశారన్నారు. పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 2,14,540 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 12:23 AM