Share News

13 నీటి ఇంజిన్లు స్వాధీనం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:21 PM

చోరీకి గురైన 13 నీటి ఇంజిన్లు స్వాధీనం చేసుకుని చోరీకి పాల్పడిన సరుబుజ్జిలి మండలంలోని వీరమల్లిపేటకి చెందిన ఏలేటి జనార్దనరావు, ఆదిరెడ్డి రంగారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు.

 13 నీటి ఇంజిన్లు స్వాధీనం

జలుమూరు: చోరీకి గురైన 13 నీటి ఇంజిన్లు స్వాధీనం చేసుకుని చోరీకి పాల్పడిన సరుబుజ్జిలి మండలంలోని వీరమల్లిపేటకి చెందిన ఏలేటి జనార్దనరావు, ఆదిరెడ్డి రంగారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. మండలంలోని కరకవలసకు చెందిన పేడాడ రామారావు తన ఇంజిను చోరీకిగురైనట్లు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు చెప్పా రు. పోలీసులు కథనం మేరకు ..సరుబుజ్జిలి మండలంలోని వీరమల్లిపేటకు చెందిన ఏలేటి జనార్దనరావు, ఆదిరెడ్డి రంగారావు మేనళ్లుడు, మేనమామలు. వీరిద్దరు కలిసి వంశధార కాలువలు, చెరువుల వద్ద సాగునీటి కోసం రైతులు పెట్టిన నీటి ఇంజిన్లు పగలు చూసి రాత్రివేళ ఆటో వేసుకొని వెళ్లి చోరీకి పాల్పడేవారు. ఆ నీటి ఇంజిన్లు ఇంటికి తరలించి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవారు. ఈనేపథ్యంలో వీరి వద్ద నుంచి 13 నీటి ఇంజన్లు స్వాధీనం చేసు కున్నారు. ప్రస్తుతం నాలుగు రైతులకు అప్పగించగా, మిగతావి ఆయా రైతులకు అప్పగించనున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:21 PM