Share News

ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:29 AM

గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా సూచించారు. మంగళవారం ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తొలుత ప్రసూతి గది, వార్డులు సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలి
గర్భిణులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

- గర్భిణులకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌ బాషా సూచన

సీలేరు, మార్చి 5: గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా సూచించారు. మంగళవారం ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తొలుత ప్రసూతి గది, వార్డులు సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఓపీ, ప్రసవాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్యాధికారితో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కసారైన ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవాలన్నారు. ఇళ్లల్లో ప్రసవం పొందడం మంచిది కాదని, తల్లీబిడ్డకు ప్రమాదమన్నారు. ధారకొండ పీహెచ్‌సీలో గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఓపీ భారీగా పెరిగిందని, గరిష్ఠంగా ప్రసవాలు నెలలో 30- 50వరకు జరుగుతున్నాయని వైద్యాధికారి డీకే హిమబిందును అభినందించారు.

Updated Date - Mar 06 , 2024 | 12:29 AM