Share News

విద్యుత్‌ చార్జీలపై వైసీపీ ఆందోళన

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:23 AM

విద్యుత్‌ సర్దుబాటు చార్జీల విధింపును నిరసిస్తూ వైసీపీ నాయకులు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లో శుక్రవారం ఈపీడీసీఎల్‌ కార్యాలయాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల సర్దుబాటు పేరుతో ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నదని ఆరోపించారు. అనంతరం ఏఈ రాంబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్‌ చార్జీలపై వైసీపీ ఆందోళన
మాడుగుల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు, నాయకులు

మాడుగుల రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సర్దుబాటు చార్జీల విధింపును నిరసిస్తూ వైసీపీ నాయకులు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లో శుక్రవారం ఈపీడీసీఎల్‌ కార్యాలయాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల సర్దుబాటు పేరుతో ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నదని ఆరోపించారు. అనంతరం ఏఈ రాంబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:23 AM