Share News

పట్టు సడలని వైసీపీ

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:30 AM

మన్యంలో వైసీపీ తన పట్టును నిలబెట్టుకున్నది. గత రెండు ఎన్నికల్లోనూ పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ, తాజా ఎన్నికల్లోనూ గెలుపొంది గిరిజనుల్లో తమ పట్టును కోల్పోలేదని నిరూపించుకుంది.

పట్టు సడలని వైసీపీ

- పాడేరు, అరకులోయ స్థానాలను దక్కించుకున్న వైనం

- పాడేరులో వైసీపీకి 42 శాతం, అరకులోయలో 37 శాతం ఓట్లు

పాడేరు, జూన్‌ 5(ఆంధ్ర జ్యోతి): మన్యంలో వైసీపీ తన పట్టును నిలబెట్టుకున్నది. గత రెండు ఎన్నికల్లోనూ పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ, తాజా ఎన్నికల్లోనూ గెలుపొంది గిరిజనుల్లో తమ పట్టును కోల్పోలేదని నిరూపించుకుంది.

పాడేరు అసెంబ్లీ నియోజవర్గంలో మొత్తం 1,58,747 ఓట్లలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజుకు 67,333 ఓట్లతో 42 శాతం, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి 47,468 ఓట్లతో 30 శాతం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సతకా బుల్లిబాబు 13,566 ఓట్లతో 8 శాతం దక్కించుకోగా మిలిగిన ఇతర అభ్యర్థులంతా 30,280 ఓట్లు పొందారు. అలాగే నోటాకు 1,408(0.8 శాతం) ఓట్లు పడ్డాయి. అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానంలో మొత్తం 1,74,588 ఓట్లకు వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలిగం 64,983 ఓట్లతో 37 శాతం, బీజేపీ అభ్యర్థి పాంగి రాజరావు 32,933 ఓట్లతో 18 శాతం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామికి 11,895 ఓట్లతో 6 శాతం దక్కింది. ఇతర అభ్యర్థుందరూ 64,777 ఓట్లు పొంది 37 శాతంకాగా, నోటాకు సైతం 3,567(2 శాతం) ఓట్లు పడ్డాయి. అనేక మంది స్వతంత్ర అభ్యర్థులకు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌ శాతం

నియోజకవర్గం పోలైన ఓట్లు వైసీపీ శాతం కూటమి శాతం ఇండియాకూటమి శాతం ఇతరులు శాతం నోటా శాతం

పాడేరు 1,58,747 67,333 42 47,468 30 13,566 8 30,280 18.2 1,408 0.8

అరకులోయ 1,74,588 64,983 37 32,933 18 11,895 6 64,777 37 3,567 2.0

Updated Date - Jun 06 , 2024 | 08:47 AM