తప్పని డోలీమోత
ABN , Publish Date - Aug 25 , 2024 | 12:39 AM
గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మండలంలోని కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన కేరంగి చిన్నమ్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది.
రహదారి సౌకర్యం లేక అవస్థలు
అనంతగిరి, ఆగస్టు 24: గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మండలంలోని కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన కేరంగి చిన్నమ్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను డోలీపై దట్టమైన అటవీ ప్రాంతం గుండా కొత్తూరు పంచాయతీ వరకు మోసుకొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.