వండర్ కిడ్
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:18 AM
పట్టణానికి చెందిన ఐదేళ్ల బుడతడు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. పట్టణానికి చెందిన అలవల మానస, సత్యప్రసాద్‌ల కుమారుడైన ఎ.ఆస్మాన్‌రామ్(5) ఆన్‌లైన్‌లో 57 సెకండ ్లలో లింగాష్టకం ఆలపించి రికార్డు సృష్టించడంతో ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదైంది.

57 సెకండ్లలో లింగాష్టకం ఆలపించిన ఐదేళ్ల బుడతడు
ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
చోడవరం, జూలై 27: పట్టణానికి చెందిన ఐదేళ్ల బుడతడు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. పట్టణానికి చెందిన అలవల మానస, సత్యప్రసాద్‌ల కుమారుడైన ఎ.ఆస్మాన్‌రామ్(5) ఆన్‌లైన్‌లో 57 సెకండ ్లలో లింగాష్టకం ఆలపించి రికార్డు సృష్టించడంతో ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదైంది. గత నెలలో ఆస్మాన్ ఈ రికార్డు సృష్టించగా, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ఆ కుటుంబానికి ఇటీవల సర్టిఫికెట్ అందజేశారు. ఆస్మాన్‌రామ్ రెండున్నరేళ్ల వయస్సులోనే 110 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను గుర్తించి ఆయా దేశాల పేర్లు చెప్పడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్ధానం సంపాదించడం విశేషం. ఆస్మాన్‌రామ్ ప్రస్తుతం స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.