పెళ్లైన నెల రోజులకే అనంత లోకాలకు...
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:38 AM
పెళ్లైయిన నెల రోజులకే ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అతనితోపాటు మరొకరు బుధవారం రాత్రి స్టీల్‌ప్లాంటు ప్రధాన మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్‌కుమార్ (30) పరవాడ ఫార్మా సిటీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం సమీపాన గల శాతవాహన నగర్‌లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలన రూపేష్‌కుమార్ (21) హైదరాబాద్‌లో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు.

ఫొటో: 27 వీఎస్‌పి 12
రైటప్:
స్టీల్‌ప్లాంటు రహదారిలో రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై
వెళుతున్న ఇద్దరు యువకులు మృతి
మృతులు మేనమామ, మేనల్లుడు
అందులో ఒకరికి గత నెల 26న విహహం
ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
పెళ్లైయిన నెల రోజులకే ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అతనితోపాటు మరొకరు బుధవారం రాత్రి స్టీల్‌ప్లాంటు ప్రధాన మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్‌కుమార్ (30) పరవాడ ఫార్మా సిటీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం సమీపాన గల శాతవాహన నగర్‌లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలన రూపేష్‌కుమార్ (21) హైదరాబాద్‌లో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి స్టీల్‌ప్లాంటు ప్రధాన మార్గంలో కణితి వైపు వెళుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో చదువుకుంటున్న రూపేష్‌కుమార్ ఇక్కడకు ఎప్పుడు వచ్చాడో, ఎందుకు వచ్చాడో తెలియదని అతని తల్లి, పవన్‌కుమార్ అక్క సంఘటనా స్థలం వద్ద భోరున విలపించింది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంటు శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
పెళ్లైన నెల రోజులకే...
ఈ ప్రమాదంలో మృతిచెందిన పవన్‌కుమార్‌కు గత నెల 26న వివాహమైందని అతని అక్క తెలిపింది. కూర్మన్నపాలెం శాతవాహన నగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడని, మరికొద్దిరోజుల్లో భార్యను ఇక్కడకు తీసుకువచ్చేందుకు చూస్తున్న సమయంలో ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.