Share News

‘ఉపాధి’ నిధులతో పల్లెల్లో మట్టి రోడ్లు

ABN , Publish Date - Dec 30 , 2024 | 01:20 AM

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 136 సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఆనందపురం మండలంలో 19, భీమిలి మండలంలో 20, పద్మనాభంమండలంలో 26, పెందుర్తి మండలంలో 71 రోడ్ల నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామస్థాయిలో పనులను స్థానికులకు అప్పగించారు.

‘ఉపాధి’ నిధులతో   పల్లెల్లో మట్టి రోడ్లు

రూ.16 కోట్లతో 136 రోడ్లకు ఆమోదం

ఇప్పటికే 47 పూర్తి: రూ.2.9 కోట్ల చెల్లింపు

సంక్రాంతి నాటికి మొత్తం పనుల పూర్తికి ప్రణాళిక

విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 136 సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఆనందపురం మండలంలో 19, భీమిలి మండలంలో 20, పద్మనాభంమండలంలో 26, పెందుర్తి మండలంలో 71 రోడ్ల నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామస్థాయిలో పనులను స్థానికులకు అప్పగించారు. వచ్చే సంక్రాంతికి ముందే రోడ్డు నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంజూరైన 136 రోడ్లలలో 130 రోడ్ల పనులు ప్రారంభించగా పెందుర్తిలోనే 38,భీములిలో ఎనిమిది, ఆనందపురంలో ఒక రోడ్డు వెరసి 47 రోడ్లు ఇప్పటికే పూర్తిచేశారు. గ్రామాల్లో ప్రజలను అనువుగా ఉన్న రోడ్లకు గుర్తించారు. ప్రధాన రహదారుల నుంచి గ్రామం వరకు. గ్రామాల్లో శ్మశానాలు, చెరువులు, కొండ ప్రాంతాలకు వెళ్లే రహదారులను సిమెంట్‌ రోడ్లగా అభివృద్ధి చేస్తున్నామని డ్వామా పీడీ ఆర్‌.పూర్ణిమాదేవి తెలిపారు. ప్రారంభించిన రోడ్లు వచ్చేనెల 15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 01:21 AM