Share News

ఎన్నికల బరిలో నిలిచేదెవరో?

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:15 AM

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో? అనే దానిపై సోమవారం స్పష్టత రానున్నది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా స్వయంగా రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల బరిలో నిలిచేదెవరో?
ఆర్వో కార్యాలయం నోటీసు బోర్డులో అరకులోయ అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు

- రేపటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

- మన్యంలో అసెంబ్లీ స్థానాలకు 40 మంది అభ్యర్థులు

- పాడేరులో 18 మంది, అరకులోయలో 22 మంది

- రెండు స్థానాల్లో 11 మంది నామినేషన్లు తిరస్కృతి

- ఆర్వో కార్యాలయాల్లో అభ్యర్థుల అఫిడివిట్‌లు ప్రదర్శన

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో? అనే దానిపై సోమవారం స్పష్టత రానున్నది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా స్వయంగా రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.

మన్యంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం 40 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. రెండు స్థానాల్లో 11 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ల విషయంలో ఎటవంటి సమస్యలు తలెత్తలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంఽధించి అఫిడవిట్‌లను ఆయా ఆర్వో కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు.

పాడేరు అసెంబ్లీ స్థానంలో 18 మందివి ఆమోదం

పాడేరు అసెంబ్లీ స్థానంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత 18 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, వైసీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బీఎస్‌పీ అభ్యర్థి సుర్ల అప్పారావు, కాంగ్రెస్‌ అభ్యర్థి సతకా బుల్లిబాబు, ఇండియా ప్రజాబందు పార్టీ అభ్యర్థి కింటుకూరి జోసెఫ్‌, సమాజ్‌ వాదీ పార్టీ మినుముల రామారావు, భారత చైతన్య పార్టీ కిల్లో రంగారావు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ దమంతి నాగేశ్వరరావు, జై మహాభారత్‌ పార్టీ బొంకు అర్జునరావు, స్వతంత్ర అభ్యర్థులు వంతాల సుబ్బారావు, వల్లా మౌనిక, అడపా విష్ణుమూర్తి, కిల్లు వెంకటరమేశ్‌నాయుడు, ఎస్‌.శంకరరావు, చెర్రెకి అప్రియంబాబు, డొంకాడ శివప్రసాద్‌, కొక్కుల కన్నబాబు చెర్రేకి గులాభీ నామినేషన్లు ఆమోదించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జానమ్మ, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ జల్లి రాంబాబు, టీడీపీ నుంచి అడపా కీర్తిమాన్విత, వైసీపీ నుంచి కిముడు శివరత్నం, స్వతంత్ర అభ్యర్థి సెగ్గే శ్రీను వేసిన నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేకపోవడం ఆర్వో భావన వశిష్ట తిరస్కరించారు.

అరకులోయలో ఆమోదం పొందిన నామినేషన్లు

జిల్లాలో అరకులోయ ఎమ్మెల్యే స్థానానికి 22 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి వి.అభిషేక్‌ ఆమోదించారు. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు, వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి శెట్టి గంగాధరస్వామి, బీఎస్‌పీ అభ్యర్థి లకే రాజారావు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కిల్లో అనిల్‌ కుమార్‌, గొండ్యాన దండకారణ్య పార్టీ అభ్యర్థి చుంచు రాజబాబు, జై భారత్‌ జాతీయపార్టీ అభ్యర్థి బురిడి ఉపేంద్ర, భారత్‌ ఆదివాసీ పార్టీ పుచ్చపుండి రామకృష్ణ, స్వతంత్ర అభ్యర్థులు సివేరి అబ్రహం, మర్రి ఉషారాణి, చెండా ఏలియా, కమ్మిడి నిర్మల, గెమ్మిలి కృష్ణారావు, తాగుల రామదాసు, నారాజీ గోవిందరావు, నారాజీ మధుబాబు, నోగిలి చంద్రకళ, మొస్యా సుజాత, సమర్డి రఘనాధ్‌ , వంతల రామన్న, సమర్డి గులాబి, సమర్డి భవానీల నామినేషన్లను ఆర్వో ఆమోదించారు.

తిరస్కరణకు గురైన ఆరుగురు నామినేషన్లు

వైసీపీ ప్రఽధానఅభ్యర్థి నామినేషన్‌ ఆమోదించడంతో డమ్మీ అభ్యర్థి రేగం చాణక్య నామినేషన్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి పాచిపెంట శాంతకుమారి ఫారం ఎ, ఫారం బి సమర్పించ పోవడం, బీజేపీ ప్రధాన అభ్యర్ధి నామినేషన్‌ ఆమోదించడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి పాంగి శ్రీలక్ష్మి, భారత్‌ చైతన్య పార్టీ అభ్యర్థి దురియా సాయిబాబా అఫిడివిట్‌లో 10 సంవత్సరాలపైగా దోషిగా నిర్ధారణ అయి, అప్పీల్‌లో శిక్ష మాత్రమే సస్పెండ్‌ చేయబడిందని ప్రకటించడంతో ఆయన నామినేషన్లు తిరస్కరించారు. అలాగే తెలుగు రాజాధికార పార్టీ అభ్యర్థి పాంగి నీలమ్మకు, అరకులోయ నియోజకవర్గం నుంచి తగిన సంఖ్యలతో ప్రతిపాదనలు లేకపోవడం, స్వతంత్ర అభ్యర్థి అడకట్ల వైకుంఠరావు నామినేషన్‌ పత్రంపై సంతకం చేయకపోవడంతో వారి నామినేషన్లను తిరస్కరించారు.

Updated Date - Apr 28 , 2024 | 01:15 AM