గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:04 AM
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు త్రికరణశుద్ధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చేస్తుందన్నారు. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి జంక్షన్‌లో రూ.105 కోట్లతో 19 రోడ్లకు, రూ.23 కోట్లతో 32 కిలోమీటర్ల రోడ్లకు పవన్‌కల్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అనంతరం బల్లగరువులో ఏర్పాటుచేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తూ.. వారిలో నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. అడవిబిడ్డల మోములో నవ్వులు చూడాలన్నదే నా కోరిక అన్నారు. మీరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది నాకు అవసరం లేదు.. మీ కష్టాల్లో అండగా ఉండాలన్నాదే నా కోరిక పవన్ కల్యాణ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన వెంటనే మంజూరు చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి పీఎం జనమన్ పథకంలో వందమంది జనాభా ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని కోరానన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తలెత్తుకునేలా కూటమి ప్రభుత్వం చేసిందని, పర్యాటకంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి గిరిజనులకు ఉపాధి కల్పిస్తామన్నారు. గంజాయి రవాణా, సాగుతో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మీ అందరిని మార్చే బాధ్యత నేను తీసుకున్నానని, మీలో మార్పు తీసుకువచ్చేవరకు నిద్రపోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నదన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
గిరిజనుల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
అడవిబిడ్డల మోములో నవ్వు చూడాలన్నదే నా కోరిక
గంజాయిపై మీలో మార్పు
తీసుకు వచ్చినంతవరకు నిద్రపోను
పర్యాటకాభివృద్ధితో గిరిజనులకు ఉపాధి
వంద మంది జనాభాకు రోడ్డు వేయిస్తా
ఏజెన్సీలో పవన్ కల్యాణ్ పలు రోడ్లకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
అనంతగిరి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు త్రికరణశుద్ధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చేస్తుందన్నారు. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి జంక్షన్‌లో రూ.105 కోట్లతో 19 రోడ్లకు, రూ.23 కోట్లతో 32 కిలోమీటర్ల రోడ్లకు పవన్‌కల్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అనంతరం బల్లగరువులో ఏర్పాటుచేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తూ.. వారిలో నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. అడవిబిడ్డల మోములో నవ్వులు చూడాలన్నదే నా కోరిక అన్నారు. మీరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది నాకు అవసరం లేదు.. మీ కష్టాల్లో అండగా ఉండాలన్నాదే నా కోరిక పవన్ కల్యాణ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన వెంటనే మంజూరు చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి పీఎం జనమన్ పథకంలో వందమంది జనాభా ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని కోరానన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తలెత్తుకునేలా కూటమి ప్రభుత్వం చేసిందని, పర్యాటకంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి గిరిజనులకు ఉపాధి కల్పిస్తామన్నారు. గంజాయి రవాణా, సాగుతో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మీ అందరిని మార్చే బాధ్యత నేను తీసుకున్నానని, మీలో మార్పు తీసుకువచ్చేవరకు నిద్రపోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, నిమ్మక జయకృష్ణ, కొప్పుల వెలమ రాష్ట్ర చైర్మన్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సీవేరి దొన్నుదొర, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, డీఎస్పీ ప్రమోద్, సీఐ హిమగిరి, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, ఈఈ వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆదేశం
అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీలోని పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభ ముగించుకుని వెళుతుండగా దారి పొడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు. వారికి అభివాదం చేసుకుంటూ పవన్ కల్యాణ్ ముందుకు సాగారు. కొర్రాపర్తి గ్రామంలోని వాహనం ఆపి అంగన్‌వాడీ, పాఠశాలను మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల భవనానికి రేకులు తీసి, శ్లాబ్ వేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. దిబ్బపాలెం తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభిమానులతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అభిమాన నాయకుడిని దగ్గరుంచి చూసిన అభిమానులు సంబరపడ్డారు.
21పిడిఆర్ 5: స్థానికంగా తయారు చేసిన బొకేలను పరిశీలిస్తున్న పవన్‌కల్యాణ్
పవన్ కల్యాణ్‌ని ఆకర్షించిన ‘ఆర్గానిక్ ’ బొకేలు!
స్థానిక వనరులతో తయారు చేసిన గిరి మహిళలు
అనంతగిరి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ని స్థానిక గిరిజన మహిళలు తయారు చేసిన ఆర్గానిక్ బొకేలు ఎంతగానో ఆకర్షించాయి. ఏజెన్సీలో సహజ సిద్ధంగా లభించిన పంటలు, పువ్వులు, కాయలతో ఆర్గానిక్ బొకేలను తయారు చేయడంపై గిరి మహిళలకు రైతు సాధికార సంస్థ అఽధికారులు, సిబ్బంది తర్ఫీదు ఇచ్చారు. దీంతో స్థానికంగా లభించే రాగులు, సామల కంకులు, అరటి ఆకులు, ఇతర పువ్వులతో బొకేలను రూపొందిస్తున్నారు. జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, తదితరులు గిరి మహిళలు తయారు చేసిన ఆర్గానిక్ బొకేలతోనే స్వాగతం పలికారు. దీంతో విభిన్నంగా ఉన్న ఆ బొకేలు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఆకర్షించాయి. వాటి గురించి ఆయన గిరిజన మహిళలను అడిగి తెలుసుకుని అభినందించారు.