Share News

చింతపల్లి ఆస్పత్రిలో వైద్య నిపుణులను నియమిస్తాం

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:47 AM

స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యనిపుణుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ చెప్పారు. ఆయన బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కి వచ్చిన ఫిర్యాదులపై వైద్యాధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులను వేర్వేరుగా విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల ఖాళీల వివరాలను తీసుకున్నామని, ప్రధానంగా మత్తు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోడం వల్ల శస్త్రచికిత్సలు జరగడంలేదన్నారు.

చింతపల్లి ఆస్పత్రిలో వైద్య నిపుణులను నియమిస్తాం
వైద్యులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ

మూడు ప్రధాన పోస్టుల భర్తీకి చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌ గౌడ

చింతపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యనిపుణుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ చెప్పారు. ఆయన బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కి వచ్చిన ఫిర్యాదులపై వైద్యాధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులను వేర్వేరుగా విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల ఖాళీల వివరాలను తీసుకున్నామని, ప్రధానంగా మత్తు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోడం వల్ల శస్త్రచికిత్సలు జరగడంలేదన్నారు. సాధారణ ప్రసవం కష్టమైన గర్భిణులను మైదాన ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో పనిచేసేందుకు ఆసక్తి చూపే వైద్య నిపుణులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనెస్థిస్టు, గైనికాలజిస్టు, జనరల్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎస్‌ఎన్‌సీయూలో కూడా పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తామని ఆయన చెప్పారు. ఆస్పత్రి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.ప్రభావతి వున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:47 AM