వృథాగా సంపద కేంద్రాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:43 AM
చెత్త నుంచి సంపద సృష్టించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మండలంలో 12గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. వీటిల్లో మాకవరపాలెం, జి.వెంకటాపురం, పెద్దిపాలెం, భీమబోయినపాలెం, గిడుతూరు, కొండలఅగ్రహారం, జి.గంగవరం, జి.కోడూరు, పైడిపాల గ్రామాల్లో సంపద కేంద్రాలను అప్పట్లోనే వినియోగంలోకి తీసుకువచ్చారు.

నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
చెరువులు, రోడ్ల పక్కన చెత్త డంపింగ్
మాకవరపాలెం, మార్చి 5: చెత్త నుంచి సంపద సృష్టించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మండలంలో 12గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. వీటిల్లో మాకవరపాలెం, జి.వెంకటాపురం, పెద్దిపాలెం, భీమబోయినపాలెం, గిడుతూరు, కొండలఅగ్రహారం, జి.గంగవరం, జి.కోడూరు, పైడిపాల గ్రామాల్లో సంపద కేంద్రాలను అప్పట్లోనే వినియోగంలోకి తీసుకువచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంపద కేంద్రాలు మూతపడ్డాయి. మరోవైపు వీధుల్లో సేకరించిన చెత్తను ఊరు చివర రోడ్లపక్కన పడేసి నిప్పు పెడుతున్నారు. మాకవరపాలెంలో సేకరించిన చెత్తను సంపద కేంద్రం దగ్గరలో ఉన్న పాపయ్యచెరువులో పడవేస్తుండడంతో చెరువుఉ నీరు కలుషితమవుతున్నది. కొండల అగ్రహరంలో సేకరించిన చెత్తను బయ్యవరం వెళ్లే రోడ్డు పక్కన పడేసి నిప్పు పెడుతున్నది. దీని నుంచి వస్తున్న పొగతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.