Share News

పచ్చిరొట్ట ఎరువు విత్తనాల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - May 24 , 2024 | 12:53 AM

జిల్లాలో ఆదివాసీ రైతులు పచ్చిరొట్ట ఎరువు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్‌ సాగుకు ముందు రైతులు పొలాల్లో పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకుని భూమిలో కలియదున్నుకుని సేంద్రియ ఎరువును పంటలకు అందించుకుంటున్నారు. తొలకరి వర్షాలు కురియడంతో రైతులు పచ్చిరొట్ట ఎరువు సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికి ఆర్‌బీకే, వ్యవసాయ కార్యాలయాలకు రాయితీ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీంతో ఆదివాసీలు విత్తనాల కోసం ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నారు.

పచ్చిరొట్ట ఎరువు విత్తనాల కోసం ఎదురుచూపులు
పచ్చిరొట్ట ఎరువు పైరు (ఫైల్‌)

- తొలకరి వర్షాలు పడడంతో నాట్లుకు రైతులు సన్నద్ధం

- ఇప్పటికీ ఆర్‌బీకేలకు సరఫరా చేయని వైసీపీ ప్రభుత్వం

చింతపల్లి, మే 23: జిల్లాలో ఆదివాసీ రైతులు పచ్చిరొట్ట ఎరువు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్‌ సాగుకు ముందు రైతులు పొలాల్లో పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకుని భూమిలో కలియదున్నుకుని సేంద్రియ ఎరువును పంటలకు అందించుకుంటున్నారు. తొలకరి వర్షాలు కురియడంతో రైతులు పచ్చిరొట్ట ఎరువు సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికి ఆర్‌బీకే, వ్యవసాయ కార్యాలయాలకు రాయితీ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీంతో ఆదివాసీలు విత్తనాల కోసం ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నారు.

వ్యవసాయ పంట భూముల్లో మితిమీరిన రసాయన ఎరువులు వాడడం వల్ల నేలలో పంటలకు మేలుచేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. నేలలో భూసారం తరిగిపోతున్నది. భూమిలో పోషకాల లోపం, చీడపీడల తాకిడి పెరిగిపోతున్నది. నేలలో సహజ భౌతిక లక్షణాలు దెబ్బతిని వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు రైతులు సమగ్ర పోషకాల యాజమాన్యంలో ప్రధానంగా పచ్చిరొట్ట పైర్ల పెంపకం చాలా కీలకం. పచ్చిరొట్ట పెంపకం వల్ల భూసారం పెరుగుతోంది. గిరిజన ప్రాంత రైతులు ఖరీఫ్‌ సాగుకు ముందు వ్యవసాయ భూములో వేసవి దుక్కులు చేసుకుని పచ్చిరొట్ట ఎరువు పైర్లు వేసుకుంటున్నారు. దీంతో పచ్చిరొట్ట ఎరువు పెట్టుకున్న పంట పొలాల్లో నాటిన పంటల నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు లభిస్తున్నాయి. దీంతో పచ్చిరొట్ట ఎరువుల పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాకు అనువైన రకాలు

జిల్లాకి అనువైన పచ్చిరొట్ట ఎరువు రకాలు ప్రధానంగా నాలుగు ఉన్నాయి. జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద పచ్చిరొట్ట ఎరువును శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రధానంగా వరినాట్లు వేసే పంట పొలాల్లో ఈ పచ్చిరొట్ట ఎరువు నాటుకుని 45-55 రోజుల తరువాత భూమిలో కలియదున్నుకోవడం వల్ల పంటలకు అవసరమైన పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ పూర్తి స్థాయిలో అందుతుంది.

ఇప్పటికీ ఆర్‌బీకేలకు చేరని రాయితీ విత్తనాలు

భూసారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్‌ ఆఖరి వారంలోనూ పంపిణీ చేయలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను 90 శాతం రాయితీపై పంపిణీ చేసేది. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా 70 శాతం రాయితీపైౖ పంపిణీ చేస్తోంది. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు వేసవి దుక్కులు చేసుకుని పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది తొలకరి వర్షాలు కురుస్తుండడం, నాట్లు వేసుకునేందుకు విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:53 AM