Share News

పనస కాయలతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:23 AM

పనస కాయలతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం లభిస్తుందని హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి.దివ్య సుధ అన్నారు. శుక్రవారం లంబసింగి రైతు ఉత్పత్తిదారుల సంఘం పరిధిలోని మహిళలకు పనసకాయతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్‌లో లభిస్తాయన్నారు. ఆదివాసీ రైతులు పనస పండ్లను నేరుగా మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారని, కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారన్నారు.

పనస కాయలతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు
పనస ఉప ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తున్న కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త దివ్య సుధ

గిరిజన మహిళలకు శిక్షణ

కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త దివ్యసుధ

చింతపల్లి, జూన్‌ 7: పనస కాయలతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం లభిస్తుందని హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త బి.దివ్య సుధ అన్నారు. శుక్రవారం లంబసింగి రైతు ఉత్పత్తిదారుల సంఘం పరిధిలోని మహిళలకు పనసకాయతో విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్‌లో లభిస్తాయన్నారు. ఆదివాసీ రైతులు పనస పండ్లను నేరుగా మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారని, కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారన్నారు. మరికొంత మంది కంపోస్టు ఎరువుగా ఉపయోగిస్తున్నారన్నారు. దీంతో గిరిజన రైతులు గరిష్ఠ ధర పొందలేకపోతున్నారన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన తాజంగి గ్రామానికి చెందిన దేశగిరి బంగారమ్మ పనసతో పలురకాల ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నదన్నారు. పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయన్నారు. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నదన్నారు. గిరిజన మహిళలు కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయతో పచ్చడి, చిప్స్‌, పనస జ్యూస్‌, జామ్‌తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చునన్నారు. ఈ ఉత్పత్తులను తయారు చేసే విధానాన్ని ఆమె స్వయంగా గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చారు. రానున్న రోజుల్లో పనస ఉప ఉత్పత్తులు తయారు చేసి మహిళలు అదనపు ఆదాయం పొందేలా కృషి చేస్తామని వివరించారు.

Updated Date - Jun 08 , 2024 | 01:23 AM