Share News

ఉక్కు ఉద్యోగులకు అందని జీతాలు

ABN , Publish Date - May 21 , 2024 | 01:01 AM

స్టీల్‌ప్లాంటు ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల జీతాలు ఇంకా అందలేదు.

ఉక్కు ఉద్యోగులకు అందని జీతాలు

ఉక్కుటౌన్‌షిప్‌, మే 20:

స్టీల్‌ప్లాంటు ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల జీతాలు ఇంకా అందలేదు. గత కొన్ని నెలలుగా వేతనాలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఇంత జాప్యం ముందెన్నడూ జరగలేదు. జీతాల విషయంలో యాజమాన్యం తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. హుద్‌హుద్‌, కరోనా సమయాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేవి. కానీ గత ఆరు నెలలుగా ఆలస్యమవుతోంది. ఇదిలావుండగా జీతాల గురించి కార్మిక సంఘాల నాయకులు కూడా మాట్లాడకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 01:01 AM