Share News

రవాణా మంత్రి తనిఖీలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:34 AM

రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి శుక్రవారం నగర పర్యటనకు వచ్చారు.

రవాణా మంత్రి తనిఖీలు

రాష్ట్ర రవాణా శాఖా మంత్రి ఎం.రాంప్రసాదరెడ్డి శుక్రవారం నగర పర్యటనకు వచ్చారు. ఆర్టీసీ కార్గోలో బుక్‌ చేసే పార్శిళ్లను డోర్‌ డెలివరీ చేసే సదుపాయాన్ని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. అంతకుముందు మంత్రి కాంప్లెక్స్‌లో ప్లాట్‌ఫారంపై నిలిపి ఉన్న పాడేరు బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాంప్లెక్స్‌ ఆవరణలోని హోటళ్లు, దుకాణాలకు వెళ్లి అక్కడ పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఒక హోటల్‌లో దోశ రుచి చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రి వెంట ఆర్టీసీ జోన్‌-1 చైర్మన్‌ దొన్నుదొర, ఇన్‌చార్జి రీజినల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 21 , 2024 | 12:34 AM