Share News

20 మంది సీఐల బదిలీలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:13 AM

విశాఖ రేంజ్‌లో 20 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ హరికృష్ణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

20 మంది సీఐల బదిలీలు

ఎన్నికల నేపథ్యంలో ఒకేచోట మూడేళ్లకు పైబడి

ఉన్నవారికి స్థానచలనం

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖ రేంజ్‌లో 20 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ హరికృష్ణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఒకేచోట మూడేళ్లకు మించి పనిచేస్తున్న సీఐలకు స్థానచలనం కల్పించారు. ఇంకా సొంత జిల్లాల్లో ఉండకూడదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తూ రేంజ్‌ వేకెన్సీ రిజర్వులో ఉన్న సీఐలు రొక్కం రవిప్రసాద్‌, జి.రాంబాబు, సీహెచ్‌ శ్రీధర్‌లను విశాఖ నగరానికి కేటాయించారు. అలాగే జి.దేముళ్లను శ్రీకాకుళం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వై.మురళీరావును విజయనగరం జిల్లా ఎస్‌.కోట యూపీఎస్‌కు, సీహెచ్‌ షణ్ముఖరావును ఎస్‌.కోట సర్కిల్‌కు, ఎన్‌వీ ప్రభాకరరావును గజపతినగరం సర్కిల్‌కు నియమించారు. అలాగే పి.రమణను అనకాపల్లి జిల్లా సబ్బవరం, బీసీహెచ్‌ స్వామినాయుడిని కె.కోటపాడు, నల్లి సాయిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీఐలుగా నియమించారు. విశాఖ సిటీలో పనిచేస్తున్న సీహెచ్‌ సూరినాయుడిని శ్రీకాకుళం డీసీఆర్‌బీకి, ఎం.అవతారాన్ని శ్రీకాకుళం ట్రాఫిక్‌కు, టి.ఇమ్మూన్యుయల్‌ రాజును శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు. శ్రీకాకుళం ట్రాఫిక్‌లో పనిచేస్తున్న టి.కామేశ్వరరావు, ఎస్‌.కోట సీఐ ఎస్‌.బాలసూర్యారావు, అనకాపల్లి జిల్లా కొత్తకోట సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌, సబ్బవరం సీఐ పి.రంగనాథంలను విశాఖ రేంజ్‌కు సరండర్‌ చేశారు. గజపతినగరం సీఐ ఎల్‌.అప్పలనాయుడిని అనకాపల్లి జిల్లా కొత్తకోట, పాతపట్నం సీఐ ఎం.వినోద్‌బాబును కశింకోట సీఐలుగా, అనకాపల్లి జిల్లాలో ఉన్న కె.కుమార్‌స్వామిని అక్కడే సోషల్‌ మీడియా సైబర్‌సెల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

భారీగా ఎస్‌ఐల బదిలీ

మూడేళ్లుగా పనిచేస్తున్న 17 మంది

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు...

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న 17 మంది ఎస్‌ఐలను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేస్తూ సీపీ రవిశంకర్‌అయ్యన్నార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వారి స్థానంలో రేంజ్‌ నుంచి కొత్తగా 17 మందిని తీసుకున్నారు. నగర కమిషనరేట్‌ పరిధిలో స్టీల్‌ప్లాంట్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న చుక్కా స్వామినాయుడు, టూటౌన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న లుకవరపు చంద్రశేఖర్‌, పెందుర్తి ఎస్‌ఐగా పనిచేస్తున్న చిన్నంనాయుడు, గోపాలపట్నం క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కరణం వెంకటసురేష్‌, ఆరిలోవ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న బరుకు అనిల్‌కుమార్‌, హార్బర్‌ క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న డి.సూరిబాబు, త్రీటౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కె.నరసింగరావు, మల్కాపురం క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న పీడీబీ శంకర్‌, సీసీఎస్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కె.సత్యనారాయణ, గోపాలపట్నం ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కోటమహంతి శ్రీనివాసరావు, సీసీఎస్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న పీవీ రమణారెడ్డి, త్రీటౌన్‌ క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎంవీ రమణ, ఎయిర్‌పోర్ట్‌ క్రైమ్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న డి.రాము, ఫోర్త్‌టౌన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎ.మోహనరావు, దువ్వాడ ఎస్‌ఐగా పనిచేస్తున్న కె.దేముడునాయుడు, పీఎంపాలెం ట్రాఫిక్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న పి.మురళీకృష్ణను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు బదిలీచేశారు. వారి స్థానంలో రేంజ్‌లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి మరో 17 మంది ఎస్‌ఐలను నగరానికి తీసుకున్నారు. వీరికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

Updated Date - Jan 05 , 2024 | 01:13 AM