Share News

తహసీల్దార్ల బదిలీ

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:45 AM

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేళ్లు పైబడి పనిచేస్తున్న 18 మంది తహసీల్దార్లను జోన్‌-1లోని అవిభాజ్య విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లాకు వచ్చి మూడేళ్లు దాటని ఇద్దరు తహసీల్దార్లను బదిలీల నుంచి మినహాయంపు ఇచ్చారు. అదే సమయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 21 మంది తహసీల్దార్లను విశాఖ జిల్లాకు కేటాయిస్తూ బుధవారం భూపరిపాలనా ముఖ్య కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

తహసీల్దార్ల బదిలీ

ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లకు పైబడి

పనిచేస్తున్న వారికి స్థానచలనం

జిల్లా నుంచి విజయనగరం, శ్రీకాకుళం,

పార్వతీపురం మన్యం జిల్లాలకు 18 మంది...

ఆ జిల్లాల నుంచి 21 మంది రాక

రెండు, మూడు రోజుల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్న కలెక్టర్‌

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేళ్లు పైబడి పనిచేస్తున్న 18 మంది తహసీల్దార్లను జోన్‌-1లోని అవిభాజ్య విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లాకు వచ్చి మూడేళ్లు దాటని ఇద్దరు తహసీల్దార్లను బదిలీల నుంచి మినహాయంపు ఇచ్చారు. అదే సమయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 21 మంది తహసీల్దార్లను విశాఖ జిల్లాకు కేటాయిస్తూ బుధవారం భూపరిపాలనా ముఖ్య కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

విశాఖ కలెక్టరేట్‌ పాలనాధికారి కేవీ ఈశ్వరరావు, ‘ఈ’ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పైలా రామారావు, ఆనందపురం, పద్మనాభం, ములగాడ తహసీల్దార్లు ఎల్‌.రామారావు, కె.వేణుగోపాల్‌, డి.వీరభద్రరావు, విశాఖ ఆర్డ్డీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎ.మనోరంజని, భీమిలి ఆర్డీవో కార్యాలయ పాలనాధికారి జె.తారకేశ్వరి, భూపరిరక్షణ, భూసంస్కరణల తహసీల్దార్లు బీటీవీ రామారావు, ఎంవీకేఎస్‌ రవి, విశాఖ ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణ ప్రత్యేక తహసీల్దార్‌ వి.శ్యాంకుమార్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న పి.నాగజ్యోతిలను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అలాగే కలెక్టరేట్‌లో ‘ఎఫ్‌’ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వి.సుజాత, గోపాలపట్నం, సీతమ్మధార తహసీల్దార్లు కె.జయ, ఎం.ఆనందకుమార్‌లను పార్వతీపురం మన్యం జిల్లాకు, భీమిలి, విశాఖ రూరల్‌, పెందుర్తి, పెదగంట్యాడ తహసీల్దార్లు సీహెచ్‌వీ రమేష్‌, ఎస్‌.రమణయ్య, పి.శ్యామ్‌ప్రసాద్‌, పి.రమాదేవిను విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు వచ్చి మూడేళ్లు పూర్తికాని మహారాణిపేట, గాజువాక తహసీల్దార్లు ఆనందకుమార్‌, శ్రీవల్లీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు.

తాజా బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం తహసీల్దారు ఎన్‌.వెంకటరావు, నెల్లూరులో ఏపీ మారిటైమ్‌ బోర్డులో పనిచేస్తున్న వై.జయలక్ష్మి, విజయనగరం జిల్లా మెంటాడ, జామి, కొత్తవలస, భోగాపురం, పూసపాటిరేగ, గరివిడి, మెరకముడిదాం, బలిజిపేట, సీతానగరం తహసీల్దార్లు టి.రామకృష్ణ, జి.హేమంత్‌కుమార్‌, శ్రీనివాస మిశ్రా, సీహెచ్‌ బంగార్రాజు, జి.భాస్కరరావు, టి.గోవింద్‌, పి.విజయభాస్కర్‌, పి.అప్పలరాజు, ఎన్వీ రమణలను విశాఖ జిల్లాకు కేటాయించారు. విజయనగరం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న బీఎస్‌ దేవీప్రసాద్‌, బి.నీలకంఠరావు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఆర్‌. ఉమామహేశ్వరరావు, జి.శ్రీరామమూర్తి, డి.రవి, ఎం. రమణమ్మ, ఎన్‌.భాస్కరరావు, పార్వతీపురం ఆర్డీవో కార్యాలయ పాలనాధికారి వి.రామస్వామి, పార్వతీపురం, సాలూరు, కొమరాడ తహసీల్దార్లు ఎన్‌.శ్రీమన్నారాయణ, ఆర్‌.బాలమురళీకృష్ణ, ఎం.భుజంగరావులను విశాఖ జిల్లాకు బదిలీ చేశారు. వీరందరికీ విశాఖ జిల్లా కలెక్టర్‌ పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. ఇందుకు రెండు, మూడు రోజుల గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రేంజ్‌లో 14 మంది సీఐల బదిలీ

వేకెన్సీలో ఉన్న, పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్‌

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ రేంజ్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీల పర్వం కొన సాగుతుంది. సీనియర్లతోపాటు తాజాగా సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్స్‌ ఇస్తూ రేంజ్‌ డీఐజీ హరికృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రేంజ్‌ వేకెన్సీ రిజర్వులో ఉన్న సీఐలు సి.సూర్యనారాయణకు శ్రీకాకుళం జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎక్స్‌)లో, అడబాల రవికుమార్‌కు విజయనగరం జిల్లా భోగాపురం యూపీఎస్‌లో, ఏవీ లీలా రావుకు విజయనగరం జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇంకా సాలూరు రూరల్‌ సీఐ ఎస్‌.ధనుంజయ రావును అనకాపల్లి రూరల్‌ స్టేషన్‌ సీఐగా, పార్వతీపురం మన్యం జిల్లా కొటియా సీఐ బి.రోహిణిపతిని అదే జిల్లాలో స్పెషల్‌బ్రాంచి (ఎక్స్‌)కు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సీఐ నమ్మి గణేష్‌ను జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు, విజయనగరం ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉన్న ఎం.చంద్రశేఖర్‌ను విశాఖ రేంజ్‌కు పంపారు. తాజాగా పదోన్నతి పొంది పోస్టింగ్‌ కోసం రేంజ్‌లో ఎదురుచూస్తున్న గేదెల బాల కృష్ణను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రూరల్‌ సీఐగా, కింతల నారాయణరావును కొటియా సీఐగా, ముదిలి శ్రీనివాసరావును విజయనగరం రూరల్‌ సీఐగా, డి.దీన బంధును అనకాపల్లి దిశ స్టేషన్‌ సీఐగా, టి.క్రాంతి కుమార్‌ను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సీఐగా, ఎస్‌.సన్యాసినాయుడిని అల్లూరి జిల్లా పాడేరు సీఐగా, బమ్మిడి అప్పలనాయుడును గూడెంకొత్తవీధి సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Feb 01 , 2024 | 01:45 AM