జిల్లా కలెక్టర్ విజయసునీత బదిలీ
ABN , Publish Date - Jun 22 , 2024 | 11:36 PM
: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల బదిల్లీ భాగంగా అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏఎస్.దినేశ్‌కుమార్‌ను నియమించారు.
పాడేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల బదిల్లీ భాగంగా అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏఎస్.దినేశ్‌కుమార్‌ను నియమించారు. విజయసునీతను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎన్నికల ముందు(ఫిబ్రవరి 14న) జిల్లా కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన సుమిత్‌కుమార్‌ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. దీంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.విజయసునీతను స్థానిక కలెక్టర్‌గా నియమించారు. ఆమె జిల్లాలో అధికారులను సమన్వయం చేసుకుంటూ పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజవర్గాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రజలతో మమేకమయ్యే అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విస్త్తీర్ణం పరంగా పెద్దదైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆమె సుమారు నాలుగు నెలలు జిల్లా కలెక్టర్‌గా సమర్థవంతంగా పనిచేశారు.