Share News

పర్యాటకుల తాకిడి

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:02 AM

నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

పర్యాటకుల తాకిడి

విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

నగరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆర్‌కే బీచ్‌రోడ్డు సందడిగా కనిపిస్తోంది. విశాఖలో నేవీకి చెందిన కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 విమానం, సీ హ్యారియర్‌ హెలికాప్టర్‌ మ్యూజియాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. వాటిని చూడడానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఆయా మ్యూజియాల వద్ద గురువారం బాగా రద్దీ పెరిగింది. రాత్రి ఎనిమిది గంటల వరకూ సందర్శకులను అనుమతించారు.

వచ్చే నెల 31 నుంచి అరకు ఉత్సవ్‌

పాడేరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

అరకు ఉత్సవ్‌ను జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. పర్యాటక ఉత్సవాలపై గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకులోయ ఉత్సవాలు, ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో మారేడుమిల్లి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యాటక ఉత్సవాలను నిర్వహించేందుకు రూ.3 కోట్లు చొప్పున మొత్తం రూ.6 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 01:02 AM