Share News

రేపే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:08 AM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏటా మాదిరిగా ‘ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌’ యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది.

రేపే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

టీపీటీ కాలనీలోని శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌ ప్రాంగణంలో నిర్వహణ

ఉదయం 10 గంటలకు ప్రారంభం

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏటా మాదిరిగా ‘ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌’ యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’...కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు...రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని సీతమ్మధార టీపీటీ కాలనీలో గల శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ స్కూల్‌ ప్రాంగణంలో జరగనున్నాయి. స్థానికంగా ‘సీఎంఆర్‌’ స్పాన్సర్‌ చేస్తోంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందించనున్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.4 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.3 వేలు ఇవ్వనున్నారు. ఇకపోతే, పోటీలో మహిళలు మాత్రమే పోటీల్లో పాల్గొనాలి. ముగ్గు, రంగులు, పువ్వులు వగైరా సామగ్రిని పోటీదారులే తెచ్చుకోవాలి. రెండు గంటల్లోగా ముగ్గు వేయాల్సి ఉంటుంది. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. పోటీల్లో పాల్గొనదలచినవారు మరిన్ని వివరాలకు ఈ 9985411659, 9492452283 నంబర్లకు సంప్రతించాలి. ఉదయం 9 గంటలకల్లా ప్రాంగణానికి చేరుకోవాలి. కచ్చితంగా పది గంటలకు పోటీ ప్రారంభమవుతుంది.

Updated Date - Jan 06 , 2024 | 01:08 AM