Share News

గిరి సంప్రదాయం... ఆకట్టుకున్న సంబరం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:37 AM

జిల్లా కేంద్రం పాతపాడేరులో ప్రతి ఏడాది ఇటుకల పండగను విభిన్నంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్థానిక అడవుల నుంచి సేకరించిన తీగలతో తాడులా బడ్డును తయారు చేసి, అలంకరించి దానికి పూజలు చేస్తారు. తరువాత అక్కా చెల్లెలైన మహిళలు ఒక వైపు, వదినా మరదళ్లు మరో వైపు ఉంటూ ఆ బడ్డును తాగుతారు.

గిరి సంప్రదాయం... ఆకట్టుకున్న సంబరం
బడ్డు లాగుతున్న రెండు బృందాల గిరి మహిళలు

- పాతపాడేరులో విభిన్నంగా ఇటుకల పండగ

పాడేరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాతపాడేరులో ప్రతి ఏడాది ఇటుకల పండగను విభిన్నంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్థానిక అడవుల నుంచి సేకరించిన తీగలతో తాడులా బడ్డును తయారు చేసి, అలంకరించి దానికి పూజలు చేస్తారు. తరువాత అక్కా చెల్లెలైన మహిళలు ఒక వైపు, వదినా మరదళ్లు మరో వైపు ఉంటూ ఆ బడ్డును తాగుతారు. అది ఎవరి వైపునకు లాక్కుంటే వాళ్లే విజయం సాధించినట్టుగా భావిస్తారు. ఇలా ఆదివారం జరిగిన బడ్డు ఉత్సవంలో అక్కా చెల్లెళ్ల బృందం విజయం సాధించింది. ఈ సందర్భంగా మహిళలంతా పాతపాడేరు నడిబొడ్డున థింసా నృత్యాలతో సందడి చేశారు. అలాగే పలువురు మహిళలు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భిన్నమైన ఈ సంబరాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు.

Updated Date - Apr 22 , 2024 | 12:37 AM