ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:26 PM
ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రవాణా పరంగా అనేక సవాళ్లున్నాయని, వాటిని అధిగమించాలన్నారు.

కలెక్టర్ విజయసునీత
పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రవాణా పరంగా అనేక సవాళ్లున్నాయని, వాటిని అధిగమించాలన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు నోడల్ అధికారులుగా వున్నారన్నారు. ఎన్నికల విధుల్లో ఎదురయ్యే పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తూ ఎన్నికల విధుల్లో మరింత చొరవ, భాగస్వామ్యం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే సూచనలపై ఎన్నికల బృందాలకు అవగాహన కల్పించాలన్నారు. మేన్‌పవర్‌పై సంపూర్ణ అవగాహనతో డేటాను రూపొందించాలని, సక్రమంగా వినియోగించుకోవాలని, అవసరమైన శిక్షణలు ఇవ్వాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగిన తరువాత నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆగకూడదన్నారు. నోడల్ అధికారులు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.అంబేడ్కర్, నోడల్ అధికారులు కె.అప్పారావు, లీలాప్రసాద్, కె.సునీల్‌కుమార్, వి.మురళి, పి.గోవిందరాజులు, సువర్ణఫణి, ఎస్‌బీఎస్.నంద్, రమేశ్‌కుమార్‌రావు, తదితరులు పాల్గొన్నారు.