Share News

పేదల కష్టాలు తీర్చడానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:49 AM

పాయకరావుపేట నియోజకవర్గంలో పేదల కష్టాలు తీర్చేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మొదటి ప్రాధాన్యం ఇస్తానని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు వెయ్యికి పైగా వినతులను ఆమె స్వీకరించారు.

	పేదల కష్టాలు తీర్చడానికి ప్రాధాన్యం
వృద్ధురాలి నుంచి అర్జీ స్వకరించి సమస్యను తెలుసుకుంటున్న హోం మంత్రి అనిత

ప్రజాదర్బార్‌లో హోం మంత్రి అనిత

వెయ్యికిపైగా ప్రజల నుంచి వినతులు

నక్కపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట నియోజకవర్గంలో పేదల కష్టాలు తీర్చేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మొదటి ప్రాధాన్యం ఇస్తానని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు వెయ్యికి పైగా వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తనకు అందించిన దరఖాస్తులను ఆయా శాఖలకు పంపంచి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. కాగా ప్రజా దర్బార్‌లో కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డుల మంజూరు కోసం, కుటుంబ, ఆరోగ్య సమస్యలు, శాంతి భద్రతలు, భూ సమస్యలు, పక్కా గృహాలు, మద్యం బెల్టుషాపులు తదితర అంశాలకు సంబంధించి వినతులు అధికంగా వచ్చాయి. నక్కపల్లి మండలానికి సంబంధించి రెవెన్యూ పరిధిలో 144, నాన్‌ రెవెన్యూ 179, ఏపీఐఐసీ భూములకు సంబంధించి 116 వినతులు వచ్చాయి. పాయకరావుపేట మండలంలో రెవెన్యూకు సంబంధించి 32, ఇతర ప్రభుత్వశాఖలకు సంబంధించి 59, ఎస్‌.రాయవరం మండలంలో రెవెన్యూ 53, ఇతర సమస్యలు 85, కోటవురట్లలో రెవెన్యూకు 23, ఇతర సమస్యలకు సంబంధించి 34 వినతిపత్రాలు అందాయి. వీటిలో కొన్నింటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. పలు శాఖల అధికారులతోపాటు కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:49 AM