జగన్ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:12 AM
వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఐదేళ్లలో వేసిన రోడ్లను తవ్వేశారు
ఉపమాక గ్రామసభలో హోం మంత్రి అనిత
నక్కపల్లి, ఆగస్టు 23: వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని ఉపమాకలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉపాధి హామీ పథకం గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో ఉపాధి పథకాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. గతంలో టీడీపీ పాలనలో వేసిన రోడ్లను పైపులైన్ల పేరుతో వైసీపీ పాలకులు తవ్వేశారన్నారు. కూటమి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చే దిశగా సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ ప్రణాళికలు రూపొందించారన్నారు. ఉపమాక పంచాయతీ పరిధిలో వున్న 9 శివారు గ్రామాల సమస్యల గురించి దేవస్థానం మాజీ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి వివరించారు. దీనిపై స్పందించిన హోం మంత్రి అనిత ఉపమాకలో మంచినీటి సమస్యతోపాటు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి వైసీపీ సర్పంచులు తీర్మానాలు చేయకపోతే వారే నష్టపోతారన్నారు. ఈ సమావేశంలో డుమా పీడీ సందీప్, తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపమాక సర్పంచ్ ప్రగడ వీరబాబు, నాయకులు తోట నగేశ్, గెడ్డం బుజ్జి, కొప్పిశెటి ్టకొండబాబు, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్, అబద్దం, తదితరులు పాల్గొన్నారు.