Share News

యువత ఆలోచనలే దేశ ప్రగతికి సోపానాలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:03 AM

యువత ఆలోచనలే దేశ ప్రగతికి సోపానాలు అని తెలుగు సినీ ర చయిత బుర్ర సాయి మాధవ్‌ అన్నారు. ఏయూ కన్వెక్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న 37వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ యూత్‌ ఫెస్టివల్‌ (యూనిఫెస్ట్‌)లో ఆదివారం ఆయన మాట్లాడారు.

యువత ఆలోచనలే దేశ ప్రగతికి సోపానాలు

వెంకోజీపాలెం, జనవరి 7 : యువత ఆలోచనలే దేశ ప్రగతికి సోపానాలు అని తెలుగు సినీ ర చయిత బుర్ర సాయి మాధవ్‌ అన్నారు. ఏయూ కన్వెక్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న 37వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ యూత్‌ ఫెస్టివల్‌ (యూనిఫెస్ట్‌)లో ఆదివారం ఆయన మాట్లాడారు. యువత తమ లక్ష్యాన్ని, మాతృదేశాన్ని మరువరాదన్నారు. భవిష్యత్తును నిర్మించుకునే శక్తి యువత చేతుల్లోనే ఉంటుందన్నారు. అనంతరం బుర్రా సాయి మాధవ్‌ను ఏఐయూ అబ్జర్వర్‌ మనీష్‌ జంగ్ర సత్కరించారు. కాగా ఉత్సాహభరిత వాతావరణంలో యూత్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. మూడవరోజు కార్యక్రమంలో భాగంగా ఫోక్‌ ఆర్కెస్ర్టా, వెస్ట్రన్‌ వోకల్‌ సోలో, పోస్టర్‌ మేకింగ్‌, వక్తృత్వ పోటీలు, మధ్యాహ్నం భారతీయ బృంద నృత్యాలు, కొల్లాజ్‌, వెస్ట్రన్‌ ఇనిస్ర్టుమెంటల్‌ సోలో, రంగోలి పోటీలు నిర్వహించారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీ (ఏఐయూ) కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ, ఏయూ సమన్వయంతో నిర్వహిస్తోంది.

Updated Date - Jan 08 , 2024 | 01:03 AM