Share News

పొగమంచు కమ్మేసింది..

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:08 AM

నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం పొగమంచు కమ్మేసింది. దీంతో వేకువజామున విధులకు హాజరయ్యే పలు పరిశ్రమల ఉద్యోగలు, కార్మికులతో పాటు వాకింగ్‌కు వెళ్లిన వారంతా ఇక్కట్లకు గురయ్యారు.

పొగమంచు కమ్మేసింది..
జాతీయ రహదారి షీలానగర్‌ వద్ద పొగమంచు

ఉదయం 8 గంటల వరకు ఇదే పరిస్థితి..

తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు

అక్కిరెడ్డిపాలెం/ఆటోనగర్‌, /గోపా లపట్నం, ఫిబ్రవరి 1: నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం పొగమంచు కమ్మేసింది. దీంతో వేకువజామున విధులకు హాజరయ్యే పలు పరిశ్రమల ఉద్యోగలు, కార్మికులతో పాటు వాకింగ్‌కు వెళ్లిన వారంతా ఇక్కట్లకు గురయ్యారు. జాతీయ రహదారిని మంచు దుప్పటి కప్పేయడంతో వాహన చోదకులకు ఎదురుగా వచ్చే ఇతర వెహికల్స్‌ కనిపించకపోవడంతో ఇబ్బం దులు పడ్డారు. దీంతో వాహనదారులందరూ హెడ్‌ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. షీలానగర్‌, బీహెచ్‌పీవీ కూడలి, ఆటోనగర్‌ జంక్షన్‌ల వద్దనున్న సిగ్నల్‌ పాయింట్లు దగ్గరకు వచ్చేంతవరకు కనిపించకపోవడంతో వాహనదారులు అగచాట్లు పడ్డారు. ఉదయం ఎనిమిది గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కాగా గోపాలపట్నం దిగువ ప్రాంతమైన కొత్తపాలెం నుంచి నరవ గ్రామానికి వెళ్లే వరకూ వ్యవసాయ క్షేత్రాలు అధికంగా ఉండడం.. సమీపంలో చెరువులు, గెడ్డలతో పాటు రిజర్వాయర్‌ కూడా ఉండడంతో ఉదయం వేళల్లో దట్టమైన మంచు కురుస్తోంది. ఒకపక్క పంట పొలాలు, మరోపక్క దట్టమైన మంచుతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించిన పలువురు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:08 AM