Share News

అభిమాని వీరాభిమానం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:38 AM

సహజంగా వివాహానికి ముద్రించే శుభలేఖల్లో తమ ఆరాధ్య దైవం, తల్లిదండ్రుల ఫొటోలను ముద్రించుకోవడం ఆనవాయితీ. కానీ ఆ వీరాభిమాని తన అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫొటోతోపాటు ఇతర నేతల ఫొటోలను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు భట్లపూడి గ్రామానికి చెందిన బాదంపూడి శ్రీనివాసరావు.

అభిమాని వీరాభిమానం
పెళ్లి శుభలేఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఇతర నాయకుల ఫొటోలు

పెళ్లి శుభలేఖలో పవన్‌కల్యాణ్‌, నేతల ఫొటోలు

అనకాపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 18 : సహజంగా వివాహానికి ముద్రించే శుభలేఖల్లో తమ ఆరాధ్య దైవం, తల్లిదండ్రుల ఫొటోలను ముద్రించుకోవడం ఆనవాయితీ. కానీ ఆ వీరాభిమాని తన అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫొటోతోపాటు ఇతర నేతల ఫొటోలను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు భట్లపూడి గ్రామానికి చెందిన బాదంపూడి శ్రీనివాసరావు. ఈయన వివాహం ఈనెల 21 తేదీన జరగనుంది. తన వివాహ శుభలేఖలో పవన్‌ కల్యాణ్‌ ఫొటోతోపాటు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఫొటోలను ముద్రించుకున్నాడు. ఈ శుభలేఖను చూసిన వారంతా అభిమానం అంటే ఇదేరా అంటూ మెచ్చుకుంటున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:38 AM